30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : డిసెంబర్ 17 పెన్షనర్స్ దినోత్సవం సందర్భంగా ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు ఆదివారం నిర్వహించారు. పురుషులకు మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవన్, మహిళలకు సి ఎస్ ఐ చర్చి కాంపౌండ్ లో ఆటల పోటీలను నిర్వహించారు.

Sports competitions under the auspices of All Pensioners

ఈ ఆటల పోటీలను జిల్లా గౌరవాధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయ రావు ప్రారంభించారు. చర్చి కాంపౌండ్ లోమహిళల కోసం జరిగిన ఆటల పోటీలను ఉపాధి శిక్షణ శాఖ మాజీ జిల్లా అధికారి డి లక్ష్మీనారాయణ ప్రారంభించారు. స్కిల్ గేమ్స్ అయిన ఇండియన్ టాగ్, బకెట్ అండ్ బాల్, వాటర్ కాయన్, పాసింగ్ బాల్ ,లూడో, ఫాస్ట్ వాకింగ్, చెస్, తదితర పోటీలను నిర్వహించి విజేతలను ప్రకటించారు. మహిళలలో క్రీస్తు కుమారి, స్వర్ణలత, పద్మలత, పద్మ కుమారి గెలుపొందారు. రిటైర్డ్ ఉద్యోగులు హమీరుద్దీన్, లక్ష్మీనారాయణ, సాయి రెడ్డి, అంసోజీ రావు, మేఘారాం, మధుసూదన్, కాలింగ్ బాస్కెట్లో, రాధాకృష్ణ తదితరులు గెలుపు పొందారు.

Sports competitions under the auspices of All Pensioners

More articles

Latest article