ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : డిసెంబర్ 17 పెన్షనర్స్ దినోత్సవం సందర్భంగా ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు ఆదివారం నిర్వహించారు. పురుషులకు మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవన్, మహిళలకు సి ఎస్ ఐ చర్చి కాంపౌండ్ లో ఆటల పోటీలను నిర్వహించారు. ఈ ఆటల పోటీలను జిల్లా గౌరవాధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయ రావు ప్రారంభించారు. చర్చి కాంపౌండ్ లోమహిళల కోసం జరిగిన ఆటల పోటీలను ఉపాధి శిక్షణ శాఖ మాజీ జిల్లా అధికారి డి లక్ష్మీనారాయణ ప్రారంభించారు. స్కిల్ గేమ్స్ అయిన ఇండియన్...