బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విదేశాల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నేటి తరం నిరుద్యోగులకు హోటల్ మేనేజ్మెంట్లో ని ఉద్యోగులకు హోటల్ మేనేజ్మెంట్ లోని పలు కోర్సులు ఎంతో ఉపయోగమని మాజీమంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గంగస్థాన్-1 లోని యు వి హోటల్ మేనేజ్మెంట్ ఆఫ్ కాలేజ్ నుఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూచైనా లాంటి పెద్ద దేశాలు వివిధ వ్యాపార వాణిజ్య సమూహాలతో పాటు హోటళ్లకు కూడా అంతే ప్రత్యేక స్థానం కల్పిస్తారని అందుకే అక్కడ హోటళ్లకు ఆదరణ ఎక్కువగా ఉంటుందన్నారు.హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు పూర్తి చేసిన వారు విదేశాలతో పాటు మనదేశంలో కూడా స్వతహాగా హోటల్లో నెలకొల్పి ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నారన్నారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు ఇదివరకు హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాలకే పరిమితమై ఉండేదని,కానీ ప్రస్తుతం నిజాంబాద్ నగరంకు కూడా ఇక్కడున్న నిరుద్యోగులకు హోటల్ మేనేజ్మెంట్ కోర్సులను అందివ్వడానికి నిర్వాహకులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. యు వి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నిర్వాహకుడు సుజన్ కుమార్ భవిష్యత్తులో హోటల్ మేనేజ్మెంట్ ఆఫ్ కాలేజీ రంగంలో మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే ఇందులో చదివే విద్యార్థులు ఆయా కోర్సులను శ్రద్ధగా నేర్చుకుని కళాశాలకు,జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హుందాన్, డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, మాజీ జెడ్పి చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు తదితరులు పాల్గొన్నారు.

