- మహాత్మ జ్యోతిబాపూలే లో న్యూ కామన్ డైట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కె.వి.ఆర్
బతుకమ్మ భిక్కనూరు : వసతి గృహాల డైట్ చార్జీలు 40 శాతం పెంచడం అభినందించదగ్గ విషయమని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి (కెవిఆర్) అన్నారు. శనివారం భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే వసతి పాఠశాలలో న్యూ కామన్ డైట్ మెనూ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ నిత్యవసర ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతుందన్నారు. గత ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించలేదని రాష్ట్ర ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతుందని ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వంనికీ కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు చదువుకొని ఉద్యోగాలు సంపాదించి సంవత్సరానికి ఒక్క నెల జీతాన్ని సమాజానికి ఖర్చు చేయాలని విద్యార్థులకు సూచనలు చేశారు. కరప్షన్ లేని కామారెడ్డిని చేయాలన్నదే నా ఆంక్ష అని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భిక్కనూరు తాసిల్దార్ శివప్రసాద్ విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు.

