25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

వేడుకగా “పచ్చబొట్టు” ఆవిష్కరణ 

Must read

📰 Generate e-Paper Clip

భీమ్‌గల్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాకు చెందిన కవులు రూపొందించిన పచ్చ బొట్టు కవితా సంకలనాన్ని తెలంగాణ సాహితీ అకాడమీ తొలి అధ్యక్షులు, ప్రక్క్యత కవి డాక్టర్. నందిని సిధారెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. జిల్లాలకు చెందిన కవులు డాక్టర్. నాలేశ్వరం శంకరం, ఘనపురం దేవేందర్, జి. నర్సింహస్వామి, తిరుమల శ్రీనివాస్ ఆచార్య, నరాల సుధాకర్ లు రూపొందించిన ఈ కవితా సంపుటిని రాజధానిలోని రవీంద్ర భారతీలో జరిగిన తెలంగాణ రచయితల సంఘం పదేండ్ల సాహితీ సభలో ఈ సంకలనాన్ని ఆవిష్కరించారని కొరవి గోపరాజు సాహిత్య సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ కవి కంకణాలు రాజేశ్వేర్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ నందిని సిద్ధారెడ్డి ప్రసంగిస్తూ నిజామాబాద్ జిల్లాలో బలమైన సాహిత్య వాతావరణం ఉందని అభినందించారు. జి. నరసింహస్వామి కవిత్వంలో గాఢత, పద చిత్రాలు, ఘనపురం దేవేందర్ కవిత్వంలో ఉత్సాహం, ప్రాసంగికత, నరాల సుధాకర్ కవిత్వంలో విలక్షణ ఇతివృత్తం, తిరుమల శ్రీనివాస్ ఆర్య కవిత్వంలో క్లుప్తత లక్షణాలు కాగా డాక్టర్ నాళేశ్వరం శంకరం కవిత్వంలో ఈ అంశాలన్నీ కనిపిస్తాయని విశ్లేషించారు. నిజామాబాద్ కవులు రూపొందించిన పచ్చబొట్టు కవితా సంకలనం స్ఫూర్తిగా తీసుకొని ఇతర జిల్లాలలో కూడా కవితా సంకలనాలు తీసుకురావాలని తెలంగాణ రచయితల సంఘం సభ్యులకు సూచించారు. తెలంగాణలో వస్తున్న చిక్కని చక్కని కవిత్వానికి పచ్చబొట్టు కవితా సంకలనం నిదర్శనం అన్నారు. తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ పచ్చబొట్టు కవితా సంకలనానికి సంపాదకులుగా వ్యవహరించారు.  జనగామ జిల్లా తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు బిల్లా మహేందర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి నేటి నిజం సంపాదకులు బైస దేవిదాస్, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి శంకర్, తెలంగాణ రచయితల  సంఘం మెదక్ జిల్లా అధ్యక్షురాలు ఎం.కవిత, జీడి రమేశ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

More articles

Latest article