వేడుకగా “పచ్చబొట్టు” ఆవిష్కరణ 

భీమ్‌గల్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాకు చెందిన కవులు రూపొందించిన పచ్చ బొట్టు కవితా సంకలనాన్ని తెలంగాణ సాహితీ అకాడమీ తొలి అధ్యక్షులు, ప్రక్క్యత కవి డాక్టర్. నందిని సిధారెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. జిల్లాలకు చెందిన కవులు డాక్టర్. నాలేశ్వరం శంకరం, ఘనపురం దేవేందర్, జి. నర్సింహస్వామి, తిరుమల శ్రీనివాస్ ఆచార్య, నరాల సుధాకర్ లు రూపొందించిన ఈ కవితా సంపుటిని రాజధానిలోని రవీంద్ర భారతీలో జరిగిన తెలంగాణ రచయితల సంఘం పదేండ్ల సాహితీ సభలో ఈ సంకలనాన్ని ఆవిష్కరించారని కొరవి గోపరాజు సాహిత్య సాంస్కృతిక...