27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏసీ బస్సు ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అన్ని ఏసీ బస్సుల బేసిక్ టికెట్ చార్జీపై 10 శాతం రాయితీ ప్రకటించింది. ఈ రాయితీ ఏసీ స్లీపర్, ఏసీ సీటర్, రాజధాని బస్సులకు వర్తిస్తుందని నిజామాబాదు రీజినల్ మేనేజర్ టి. జోత్స్న తెలిపారు. ప్రయాణీకులకు ఉన్నత స్థాయి ప్రయాణాన్ని మరింత అందుబాటులో ఉంచడం, సౌకర్యవంతంగా చేయడం లక్ష్యంగా ఈ ఆఫర్ ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ప్రయాణీకులు ఈ అఫర్ ను ఉపయోగించుకొని, 10 శాతం తగ్గింపు టికెట్ చార్జీతో చౌకైన సౌకర్యవంతమైన ప్రయాణం చేయాలనీ కోరారు. ఈ తగ్గింపు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అన్ని ఏసీ బస్సుల ద్వారా అందుబాటులో ఉన్న అన్ని రూట్లలో వర్తిస్తుందని తెలిపారు. మరిన్ని వివరాలకు, www.tgsrtconline.in ద్వారా లేదా మీకు సమీప బస్సు రిజర్వేషన్ కౌంటర్ నందు కూడా టికెట్ బుక్ చేసుకునే సౌకర్యం ఉందన్నారు.

More articles

Latest article