ఏసీ బస్సు ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్

నిజామాబాద్ సిటీ బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అన్ని ఏసీ బస్సుల బేసిక్ టికెట్ చార్జీపై 10 శాతం రాయితీ ప్రకటించింది. ఈ రాయితీ ఏసీ స్లీపర్, ఏసీ సీటర్, రాజధాని బస్సులకు వర్తిస్తుందని నిజామాబాదు రీజినల్ మేనేజర్ టి. జోత్స్న తెలిపారు. ప్రయాణీకులకు ఉన్నత స్థాయి ప్రయాణాన్ని మరింత అందుబాటులో ఉంచడం, సౌకర్యవంతంగా చేయడం లక్ష్యంగా ఈ ఆఫర్ ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ప్రయాణీకులు ఈ అఫర్ ను ఉపయోగించుకొని, 10 శాతం తగ్గింపు టికెట్ చార్జీతో చౌకైన సౌకర్యవంతమైన ప్రయాణం...