29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

యువకుడి అదృశ్యం

Must read

📰 Generate e-Paper Clip

–కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు 

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన అంజత్ ఖాన్ (37)కనబడడం లేదని స్థానిక అందల్వాయి పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఎస్సై మనోజ్ కుమార్ కు సోమవారం ఫిర్యాదు చేశారు. గత మూడు నెలల నుండి అంజత్ ఖాన్ ఆచూకీ దొరకడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అదృశ్యమైన వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.ఎవరికైనా సమాచారం ఉన్నట్లయితే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు.

More articles

Latest article