నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ప్రత్యేక రాష్ట్రం కోసం 60 ఏళ్లపాటు కొట్లాడిన తెలంగాణ ప్రజల కలను నెరవేర్చిన దేవత కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ అని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. పార్టీ కార్యాలయంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు తెలంగాణలోని ప్రజలందరూ ఆమెకు కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం జిల్లా మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలు రేవతి ఆధ్వర్యంలో మహిళా నాయకులు కేక్ కట్ చేశారు. ఇటీవల జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన విపుల్ గౌడ్ ను పలువురు జిల్లా సీనియర్ నేతలు అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు, సీనియర్ నాయకులు జావిద్ అక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

