తెలంగాణ ప్రజల కల నెరవేర్చిన దేవత సోనియాగాంధీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ప్రత్యేక రాష్ట్రం కోసం 60 ఏళ్లపాటు కొట్లాడిన తెలంగాణ ప్రజల కలను నెరవేర్చిన దేవత కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ అని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. పార్టీ కార్యాలయంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు తెలంగాణలోని ప్రజలందరూ ఆమెకు కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం జిల్లా మహిళా కాంగ్రెస్...