29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం 

Must read

📰 Generate e-Paper Clip

రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

బతుకమ్మ,మోర్తాడ్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పేదల ప్రభుత్వామని, పేదలకు సంక్షేమం అందించడం కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతిపెద్ద రుణమాఫీ ఇప్పటికి 25 లక్షల మంది రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ జరిగి, త్వరలో 2 లక్షలకు పైగా రుణాలు కలిగిన రైతులకు మాఫీ అవుతుంది అని అన్నారు. వరి వేస్తే ఉరి అనుకునె రోజుల నుండి వరి పంటకు క్వింటాలుకు 500 బోనస్ అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలో 55వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్,200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ద్వారా కుటుంబానికి దాదాపు నెలకు రూ.10,000 ఆదా అవుతుందని చెప్పారు.

Congress Government is People's Government

రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలియజేశారు. సమీకృత గురుకులాల ఏర్పాటు ద్వారా విద్యా వ్యవస్థలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారు. రెసిడెన్షియల్ పాఠశాలల కోసం ఆహార, కాస్మోటిక్ బిల్లులు పెంపుదల చేసి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించామన్నారు. స్వయం సహాయక సంఘాలకు, పారిశ్రామిక వేత్తలకు రుణాలు ఇస్తున్నామన్నారు. అవినీతి ధరణి పోర్టల్ ను ఎన్ఐసీ జాతీయ సంస్థకు అప్పగింత ద్వారా అవినీతికి దూరంగా ఉంచామన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలను స్వేచ్చగా కలుసుకునే అవకాశం మీడియాకు స్వేచ్చ, మారక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపామన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం అందించామన్నారు. నియోజకవర్గానికి 3500-4500 చొప్పున రాష్ట్రంలో 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయంలో కుటుంబ పాలన నడిచిందని 10 ఏళ్ళలో వారి కుటుంబం మాత్రమే బాగుపడిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పేదల ప్రభుత్వమని పేదలకు సంక్షేమం అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని అన్నారు. ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికి ముఖ్యమంత్రి ఆదేశంతో నియోజకవర్గ ప్రజలకు బాధ్యతతో ప్రజలకు సేవ చేస్తున్నానని అన్నారు. నియోజకవర్గంలో గంజాయి, రౌడియిజం,గుండాయిజం లేకుండా చేసానని అన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Congress Government is People's Government

More articles

Latest article