30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

సైన్స్, ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్స్ భవిష్యత్ తరాలకు పునాది 

Must read

📰 Generate e-Paper Clip

  • అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్

నిజామాబాద్ సిటీ బతుకమ్మ :  సైన్స్ ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్స్ భవిష్యత్ తరాలకు పునాదులు లాంటివని జిల్లా అడిషనల్ కలెక్టర్కిరణ్ కుమార్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో నిర్వహించినఇన్నోవేషన్, సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ ముగింపు కార్యక్రమం శనివారం సాయంత్రం తో ముగిసాయి. ఇన్నోవేషన్,  సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కార్యక్రమాలు వేరువేరుగా నిర్వహించిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి రాష్ట్రీయ స్థాయిలో నిర్వహించే సైన్స్ ఫెయిర్ కార్యక్రమాల్లో వీరికి అవకాశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూవిద్యార్థులు ఉన్న మేధస్సును పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని,ఆయన అన్నారు.ఈ కార్యక్రమాల్లో చామ ప్రదర్శించిన వివిధ అంశాల్లో రాణించకపోయినప్పటికీ అందుకు నిరాశ పడకుండా మరో అవకాశంలో గెలిచే విధంగా ప్రణాళికలు చేసుకోవాలని ఆయన అన్నారు. అప్పుడే విజయం తప్పక సాధించవచ్చు అని అన్నారు. రెండు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమం ఎంతోమంది పేద విద్యార్థిని విద్యార్థులకు వారి ప్రతిభను బయటకు రానిచ్చేందుకు కార్యక్రమం ఎంతగానో దోహదపడిందన్నారు. అనంతరం విజేతలుగా నిలిచిన వారిని  సత్కరించారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్లు  అడిషనల్ కలెక్టర్ ను సన్మానించారు.

Science and innovation exhibitions are the foundation for future generations

More articles

Latest article