27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన ఇంటర్మీడియట్ నోడల్ అధికారి

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం శుక్రవారం ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సందర్శించారు. కళాశాల రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అధ్యాపకులతో సమావేశం నిర్వహించి 90 రోజుల ప్రణాళికను అమలుచేసి ప్రతి విద్యార్థి కూడా పబ్లిక్ పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణులు అయ్యేలా కృషి చేయాలని అన్నారు. తర్వాత విద్యార్థులను సబ్జెక్టు అంశాలపై పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా.డి. నిజాం, అధ్యాపక బృందం, అధ్యాపకేతర బృందం, నోడల్ ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు.

Intermediate Nodal Officer visited Govt Junior College

More articles

Latest article