బతుకమ్మ, మాచారెడ్డి: మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై మాచారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పోలీస్ కళాబృందం, షీ టీమ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మధ్యకాలంలో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలకు విద్యార్థులు లోనవ్వుతున్నట్లు తేలిందని వివరించారు. కళాబృందం, షీటీం, సైబర్ క్రైమ్, AHTU ఏ హెచ్ టీయూ గురించి అవగాహన కల్పించనైనది. నార్కోటిక్ టోల్ ఫ్రీ నెంబర్. 1908 లేదా 8712671111, షీటీం నెం. 8712686094, సైబర్ నేరాల పట్ల టోల్ ఫ్రీ నెంబర్ 1930కు, కాల్ చేసి వినియోగించు కోవలెనని వివరించారు. అత్యవసర పరిస్థితుల టోల్ ఫ్రీ నెంబర్లు 100, 108, 1930, 181 ల విలువలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కళాబృందం సభ్యులు పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
