బతుకమ్మ, ఏర్గట్ల: మండలం తాల్లరంపూర్ గ్రామంలో ప్రజాపాలన విజయోత్సవ సంబరాలలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి గ్రామ రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సోమా దేవరెడ్డి ,ఆడేం గంగా ప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అబద్ధపు ప్రచారం మాని ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి అని అన్నారు. గత ప్రభుత్వం అవి నీతికి అలవాటు పడినట్టు, కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి సంస్కృతికి,అవినీతికి అలవాటు పడదు అని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు,పేదలకు ,బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు అండగానే ఉంటుందని అన్నారు. ఇకనైనా వారు ప్రభుత్వతో కలిసి నడిస్తే ప్రజలు స్వాగతిస్తారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవా రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆడెం గంగ ప్రసాద్, మాజీ సర్పంచ్ లు కోటగిరి రామా గౌడ్, తుమ్మల ప్రభాకర్, అవుసుల భాను, గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దిప్పా శ్రీనివాస్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల అశోక్, చేను గురువయ్య, ఖ్యాతం మధు, బెజ్జారం శ్రీనివాస్, ఖ్యాతం నవీన్, సుదర్శన్, బెజ్జరం భానుచందర్, గడ్డం రాము, గుమ్మిర్యాల సంజీవ్, సామ్సన్, నర్సయ్య, లాల్ సింగ్, రాంపేల్లి గంగాధర్, గ్రామపంచాయతీ సెక్రటరీ భోజన్న, మహిళా సంఘాల సభ్యులు,పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
