ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ లోని శ్రీ భాషిత పాఠశాలలో ఏడవ తరగతి చెందిన టి.సాత్విక్ శనివారం మహబూబ్ నగర్ లో జరిగిన 68 వ ఎస్జీఎఫ్ఐ జాతీయస్థాయి అండర్ 14 రగ్బి ఆటలో జాతీయస్థాయిలో ఎంపికైనట్లు శ్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఆటలు చదువులో భాగమని చెప్పారు. అంతేకాకుండా ఆటల వలన శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు అని అన్నారు. అనంతరం జాతీయస్థాయిలో ఎంపికైన విద్యార్థిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పి ఈ టి తదితరులు పాల్గొన్నారు.
