29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

వర్ని కళాశాలను ఆకస్మికతనిఖీ చేసిన జిల్లా ఇంటర్ విద్యాధికారి

Must read

📰 Generate e-Paper Clip

వర్ని, బతుకమ్మ : వర్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్య అధికారి  తిరుమలపుడి రవికుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో అధ్యాపకులు విద్యార్థులకు చేస్తున్న విద్యాబోధనను తనిఖీ చేశారు. జిల్లా ఇంటర్ విద్యా అధికారి ప్రిన్సిపల్ తోపాటు అధ్యాపకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమల పూడి రవికుమార్ మాట్లాడుతూ 2024 – 25 విద్యా సంవత్సరం కు రానున్న వార్షిక పరీక్షలకు అధ్యాపకులు ప్రణాళిక బద్ధంగా బోధన చేసి మంచి ఉత్తీర్ణత ఫలితాలను సాధించాలని ఆదేశించారు. రాబోయే ఇంటర్ ప్రయోగ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడంతో పాటు విధ్యర్జనలో వెనుకబడిన బడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు, వారు కూడా ఉత్తీర్ణులు అయ్యేందుకు ప్రత్యేక ప్రణాళికతో భవిష్యత్ తీర్చిదిద్దాలని ఆదేశించారు. పేద, బడుగు బలహీన, మైనారిటీ, విద్యార్థులు అభ్యసిస్తున్నారని, మంచి విద్యా బోధన జరగాలని ఆదేశించారు. కళాశాలలో లైబ్రరీ, సైన్స్ లాబ్ ల నిర్వహణ కోసం నిధులు సమకూర్చడం జరుగుతుందని అన్నారు. కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్, మత్తు పదార్థాల పట్ల అవగాహన కల్పించాలని అన్నారు. కళాశాలకు సమయపాలన పాటించడంతోపాటు ఆలస్యంగా వచ్చిన అధ్యాపకులు, సిబ్బంది పై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సమావేశంలో ప్రిన్సిపాల్ కల్పన తో పాటు అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

District Inter Vidyadhikari conducted surprise inspection of Varni College

More articles

Latest article