29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

నారాయణ కాలేజీ పై చర్య తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బగోని అశోక్ గౌడ్

ఆర్మూర్, బతుకమ్మ : మేడ్చల్ జిల్లా పోచారం పరిధిలో గల నారాయణ కాలేజీలో  తనీష్ అనే విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన లెక్చరర్ లు,  నారాయణ కాలేజ్ యజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బగోని అశోక్ డిమాండ్ చేశారు. తనీష్ నారాయణ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న అతను బలవన్మరణానికి కారమైన లెక్చరర్లు,  నారాయణ కళాశాల యజమాన్యం సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నాదని అన్నారు. బాధితులకు అండగా తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఉంటుందని తెలియజేశారు. తనీష్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత గుట్టుచప్పుడు కాకుండా తనీష్ మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా పోస్టు మార్డానికి తరలించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా చదువులు బోధించాలి తప్ప ర్యాంకుల కోసం వారిని మానసికంగా వేయించకూడదని అబ్బగోని అశోక్ గౌడ్ ఈ సందర్భంగా తెలియజేశారు. వెంటనే ఆ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం నారాయణ కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More articles

Latest article