బతుకమ్మ భిక్కనూరు : భిక్కనూరు కేంద్రంలోని దక్షిణ కాశిగా పిలువబడే శ్రీ సిద్ధ రామేశ్వర దేవస్థానంలో ఉన్న కోడే దూడలకు పెద్ద మల్లారెడ్డి గ్రామానికి సంబంధించిన మంగలి బాబు పోచమ్మర బాబు టప్ప రమేష్ నర్సింలు ట్రాక్టర్ గడ్డిని వితరణ చేశారు. పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ అందే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గడ్డిని తగుల పెట్టకుండా ఆలయానికి విరాళం చేయాలని కోరారు. ఈ సందర్భంగా గడ్డి విరాళ దాతను ఆలయ కమిటీ తరఫున శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీధర్ సిబ్బంది ఉన్నారు.
