బతుకమ్మ, మాచారెడ్డి: సీఈఐఆర్ ద్వారా ట్రేస్ చేసి షొగొట్టుకున్న రెండు సెల్ ఫోన్లు రికవరి చేసి బాధితులకు పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు మాచారెడ్డి ఎస్సై అనిల్ తెలిపారు. పాల్వంచ మండల కేంద్రానికి చెందిన బక్కేల్లి భూపాల్ గౌడ్ , రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజుపేట కు చెందిన అల్లే అశోక్ లకు వారి ఫోన్ లు అప్పగించారు. మోబైల్ ఫోన్ లు దొంగతనం జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
