తహసీల్దార్ తారాబాయి
రుద్రూర్, బతుకమ్మ : పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని రుద్రూర్ మండల తహసిల్దార్ తారాబాయి అన్నారు. సోమవారం రుద్రూర్ మండల కేంద్రంలోని సిద్దాపూర్, సులేమాన్ నగర్ గ్రామాలలో గల అంగన్వాడి కేంద్రాలు, ఉర్దూ మీడియం, తెలుగు మీడియం పాఠశాలలను తహసీల్దార్ తారాబాయి, ఎంపిడిఓ సురేష్ బాబు ఆకస్మకంగా తనిఖీ నిర్వహించారు. పాఠశాలలోని వంట గది, మధ్యాహ్న భోజనం వండే తీరును పరిశీలించారు . అనంతరం మధ్యాహ్న భోజనం ఏజెన్సీలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆయా పాఠశాలలో విద్యార్థులకు వడ్డిస్తున్న భోజన సదుపాయాలను, పాఠశాల పరిసరాలను, మరుగుదొడ్లను పరిశీంచారు. వంట గదితోపాటు పాఠశాల ఆవరణ శుభ్రంగా ఉంచుకోవాలని పాఠశాల సిబ్బందికి తగు సూచనలు సలహాలు చేశారు. తహసీల్దార్ వెంట పంచాయతీ సెక్రటరీ, అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.
