25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

కొడుకును చంపిన తండ్రి అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : కొడుకును చంపిన కేసులో తండ్రిని, అతనికి సహకరించిన మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన దేవును పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దేవుని పల్లి మండలం ఉగ్రవాయి గ్రామానికి చెందిన కోదండం సాయిలు గోసంగి కాలనీలో నివాసం ఉంటున్నాడు. సాయిలుకు భార్య, కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సాయిలు కొడుకు కోదండం రాజు ఏ పనిచేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు. మద్యానికి బానిసయ్యాడు. ప్రతి రోజు మద్యం తాగి వచ్చి తన తండ్రి సాయిలు, తల్లి సాయవ్వ, ఇద్దరు చెల్లెళ్లను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. దీంతో విసుగు  చెందిన కోదండం సాయిలు తన కుమారుడుని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం కామారెడ్డికి చెందిన అనిల్ అనే వ్యక్తితో కలిసి చంపేందుకు పథకం వేశాడు. అందుకు అనిల్ కు ఒక లక్షా రూపాలయల సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఇరువురు కలిసి పథకం ప్రకారం శుక్రవారం రాత్రి కోదండం రాజుకు ఫుల్లుగా మద్యం తాగించారు. స్పృహ లేకుండా చేసి అతనిని అనిల్ మోటార్ సైకిల్ పై ఉగ్రవాయి శివారులోని వ్యవసాయ భూమిలో గొంతు చుట్టూ టవల్ తో ఉరిగా వేసి ఊపిరాడకుండా చేసి చంపి శవాన్ని అక్కడే ఉంచి పారిపోయారు. కేసు దర్యాప్తు చేసి కోదండం సాయిలు, అనిల్ ను విచారించగా తాము చేసిన నేరం ఒప్పుకున్నారు. వీరి వద్ద నుంచి రెండు మోటార్ సైకిళ్లు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో పాల్గొని 24 గంటల్లో మర్దర్ కేసును ఛేదించిన కామారెడ్డి రూరల్ సీఐ రామన్, దేవుని పల్లి ఎస్సై రాజు, క్రైమ్ టీం సిబ్బంది రవికిరణ్, శ్రీనివాస్ గౌడ్ ,రాజు లను జిల్లా ఎస్పీ, కామారెడ్డి సబ్ డివిజనల్ అధికారి నాగేశ్వరరావు అభినందించారు.

More articles

Latest article