29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Must read

📰 Generate e-Paper Clip

బిచ్కుంద, బతుకమ్మ : కల్లూర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం బిచ్కుంద మండలం వాజీదనగర్ గ్రామానికి చెందిన సాయిలు(48) అనే వ్యక్తి తన ద్విచక్రవాహనంపై హున్స గ్రామం వెళ్లి తిరిగి వస్తున్నాడు. పోతంగల్ – బీర్కూర్ రోడ్డులో గల కల్లూరు గ్రామ శివారులో దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుమారుడు సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

More articles

Latest article