29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

వెంకన్న కళ్యాణానికి పీసీసీ ప్రెసిడెంట్ కు ఆహ్వానం

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ భీమ్ గల్ చొక్కయ్య గుట్ట శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణనికి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను ఆహ్వానించారు. ఈ మేరకు ఆలయ కమిటీ వారు గురువారం డీసీసీ ప్రెసిడెంట్, స్టేట్ కోప్రాటివ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మహేష్ గౌడ్ ను కలిసి శ్రీవారి కల్యాణ మహోత్సవ పత్రికను అందజేశారు. ఈ సందర్బంగా మహేష్ గౌడ్ ను పూల బొకే, షాలువతో సన్మానించారు. ఈ నెల 3 న జరుగనున్న చొక్కయ్య శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి కల్యాణనికి తప్పక హాజరు కావాలని ఆలయ కమిటీ వారు ఆయనను కోరారు. పీసీసీ ప్రెసిడెంట్ ను కలిసిన వారిలో మండల కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ బోదిరే స్వామి, ఆలయ కమిటీ సభ్యులు నైంటి వన్ గంగాధర్, మాజీ ఎంపిటీసీ గంగన్న, బోదిరే తిరుపతి, రాజేశ్వర్,ఆరిగేలా జనార్దన్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article