ఆర్మూర్, బతుకమ్మ : ఆడుకుంటూ ఓ చిన్నారి డ్రెయినేజీలో పడి మృతి చెందింది. ఆర్మూర్ పట్టణంలోని 35వ వార్డులో ఈ ఘటనతో విషాదచాయలు అలుముకున్నాయి. రాంనగర్ కు చెందిన ప్రశాంత్ కూతురు మట్ట ధనశ్రీ(3) ఇంటి ముందు ఆడుకుంటూ డ్రెయినేజీలో పడిపోయింది. విషయం తెలియని తల్లిదండ్రులు చిన్నారి కోసం చాలాసేపు వెతికారు. చివరకు డ్రెయినేజీలో చిన్నారి కనిపించడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. కాల్వల నుంచి బయటకు తీయగా అప్పటికే ఊపిరాడక ధనశ్రీ మృతి చెందింది. ఇళ్ల ముందు డ్రెయినేజీల వద్ద రెయిలింగ్ వంటి ఏర్పాట్లు చేయకపోవడంపై పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

