28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సంగారెడ్డి జిల్లాలో కారు ప్రమాదం

Must read

📰 Generate e-Paper Clip

  • తండ్రీ కొడుకు మృతి.. భార్య. కోడలు పరిస్థితి విషమం
  • మృతి చెందిన వారు నిజామాబాద్ జిల్లా వాసులు 
  • మాజీ జెడ్పిటిసి సభ్యులు.. ఆయన కుమారుడు మృతి 
  • కోటగిరి, పొతంగల్ మండలాల్లో విషాద ఛాయలు 

నిజామాబాద్, బతుకమ్మ : సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా వాసులు తండ్రి ,కొడుకు కారు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందగా, భార్య, కోడలు పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు వెళితే నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం బస్సాపూర్ గ్రామానికి చెందిన మాజీ జెడ్పిటి సభ్యులు శివరాజ్ దేశ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఆయన కుమారుడు రాజశేఖర్, సంగారెడ్డి జిల్లా జోగిపేట్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందారు. హైదరాబాద్ నుంచి తమ స్వగ్రామమానికి కారులో వస్తుండగా కారు ప్రమాదంలో తండ్రి శివరాజ్ దేశాయ్, అతని కుమారుడు రాజశేఖర్ అక్కడికక్కడే మృతిచెందగా, శివరాజ్ భార్య లక్ష్మీబాయి, రాజశేఖర్ భార్య అరుణ  తీవ్ర గాయాలకు గురయ్యారు వీరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన పట్ల బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కోటగిరి జెడ్పిటిసి సభ్యులుగా శివరాజ్ దేశాయ్ పనిచేసి ప్రజల సేవకు అంకితమయ్యారు. ఆయన కుమారుడు రాజశేఖర్ బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్నారు.

More articles

Latest article