రుద్రూర్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని హక్కుల జాతీయ వేదిక ఎన్.పి.ఆర్.డి జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర, సహయ కార్యదర్శి యేషాల గంగాధర్ డిమాండ్ చేశారు. రుద్రూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసిల్దార్ తారాబాయికు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అన్నారు. అదేవిధంగా వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్, వృద్ధులకు 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, వికలాంగులకు బ్యాగ్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, తదితర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ నజీర్, రుద్రూర్ మండల అధ్యక్షుడు సాయిలు, కార్యదర్శి రాజేందర్, జలీల్, లక్ష్మి, తెల్ల సుభద్ర తదితరులు పాల్గొన్నారు.

