వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
రుద్రూర్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని హక్కుల జాతీయ వేదిక ఎన్.పి.ఆర్.డి జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర, సహయ కార్యదర్శి యేషాల గంగాధర్ డిమాండ్ చేశారు. రుద్రూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసిల్దార్ తారాబాయికు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అన్నారు. అదేవిధంగా వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్, వృద్ధులకు 4000...