27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మోటాట్ పల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని మొటాట్ పల్లి గ్రామంలో తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా స్థానిక పశువైద్యాధికారి డాక్టర్ అనిల్ రెడ్డి మాట్లాడుతూ రైతులు అందరూ ఈ వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆవులు గేదెలు ఏవైనా కట్టనిచో వాటిని పరీక్షించి గర్భకోశ వ్యాధులకు తగిన చికిత్స అందించడం జరిగింది. ఈ లింగ నిర్ధారిత వీర్యము వాడడం వలన 90% ఆడదూడలు మాత్రమే జన్మిస్తాయని తెలిపారు. దీనికిగాను రైతు వాటా 250 రూపాయలు చెల్లించాలని తెలిపారు. ఒకే పశువుకు వరుసగా రెండు ఎదలలో లింగ నిర్ధారిత వీర్యము వాడిన చూలు కట్టకపోతే రైతు వాటా 500 రూపాయలు రైతు అకౌంట్ కు వాపస్ ఇవ్వబడును. ఈ శిబిరంలో దాదాపు 25 గేదెలు 8 ఆవులకు చికిత్స చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో dr. అబ్దుల్ మాజీద్ నిజామాబాద్, తాడ్వాయి పశువైద్యాధికారి డాక్టర్ రమేష్, డి ఎల్ డి ఏ సూపర్వైజర్ కృష్ణ మరియు పాల కేంద్రం సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.

More articles

Latest article