28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఖాసింపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  న్యాయవాది ఖాసింపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రెండో రోజు విధులు నిర్వహించి నగరంలోని ధర్నా చౌక్ వద్ద మానవహారం నిర్వహించాారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ మాట్లాడారు. నిజామాబాద్ అసోసియేషన్ కు చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది కసిం ఖలీద్ పై అరాచకంగా కొందరు రౌడీ మూకలు దాడి చేశారని అన్నారు. చట్టం కోసం, ప్రజలకు కోర్టుల ద్వారా న్యాయం చేసే న్యాయవాదులపై కొంతమంది రౌడీ మూకలు దాడికి దిగదాన్ని ఖండించారు. తమ న్యాయవాదిపై దాడి జరిగి రెండు రోజులు గడుస్తున్న సంబంధిత టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదనిప్రశ్నించారు. ఇకమీదట ఇలానే న్యాయవాదులపై దాడులు జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులుఆశ నారాయణ,మాణిక్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article