27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

సీసీ రోడ్డు, అంగన్వాడీ నిర్మాణాలకు భూమి పూజ 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మద్నూర్/డోంగ్లి: మండలంలోని కుర్ల గ్రామంలో సీసీ రోడ్డు, దోతీలో అంగన్వాడీ సెంటర్ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అన్నివిధాల అభివృద్ధి చేసేందుకు పూర్తిస్థాయిలో తన వంతు కృషి చేస్తానని చెప్పుకొచ్చారుఈ కార్యక్రమంలో ఆ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజు పటేల్, సీనియర్ నాయకులు నాగేష్ పటేల్, హనుమాన్లు, స్వామి, రామ్, పటేల్, ఏఎంసి వైస్ చైర్మన్, పరమేష్ పటేల్, ఇరు మండలాలకు చెందిన ముఖ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

More articles

Latest article