ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణంలోని నల్ల పోచమ్మ ఆలయం వద్ద ఆర్మూర్ సర్వ సమాజ్ ప్రజా ఐక్య సమితి ఆధ్వర్యంలో సోమవారం ప్రహరీ గోడ నిర్మాణానికి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వసమాజ అధ్యక్షులు ఆకుల రాజు మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ పరిసరాలలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఉండటానికి ఆలయ భద్రత కొరకు ఈ యొక్క ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ కార్యదర్శి కర్తన్ దినేష్, సదర్లు గుండేటి మహేష్, బచ్చేవాల్ రెడ్డి ప్రకాష్, చిట్టి శ్రీనివాస్, దొడ్ల గోపాల్, సిద్దాపురం లింగన్న, సర్వాసమాజ్ సభ్యులు గోదూరి శ్రీనివాస్, బారడ్ బాలాజీ రావు, ధోండి శ్యామ్, చేపూర్ ధనంజయ్, ధోండి ఈశ్వర్, లక్కాకుల రంజిత్, నర్మే రాజన్న, రాజులదేవి రవీంద్రనాథ్, కోగుల పూల నర్సయ్య, గోగీకర్ చిన్నాజీ మరియు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది.
