బీసీ, ఎస్సీ, ఎస్టీల వ్యతిరేకి బీజేపీ

0 2,805

. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శ

. కుల గణన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్‌కు  నివేదిక అందజేత

హైదరాబాద్, బతుకమ్మ: రాజ్యాంగం ప్రకారం బీసీలకు హక్కులు కల్పించలేదని, ఇప్పటికీ బీసీ వర్గాలకు న్యాయం జరగడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కుల గణన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్‌కు సోమవారం నివేదిక అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక బీసీలకు న్యాయం జరిగిందని,  రాజకీయంగా, ఆర్థికంగా ప్రాంతీయ పార్టీలు లాభం చేశాయన్నారు. కులగణనకు వ్యతిరేకంగా బీజేపీ సుప్రీంకోర్టులో చెప్పిందని, బీజేపీ డీఎన్ఏలోనే బీసీ, ఎస్సీ, ఎస్టీలపై వ్యతిరేకత ఉందని విమర్శించారు. స్థానిక సంస్ధల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 11నెలలపాటు బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయలేదని, ఇప్పుడు నెల రోజుల్లో డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. కులగణన కోర్టుల్లో నిలబడుతుందా లేదా అనేదానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అనేక చోట్ల ఇళ్లకు స్టిక్కర్లు అంటించలేదన్నారు. డెడికేటెడ్ కమిషన్ ఇండిపెండెంట్‌గా పని చేయాలని కోరారు. మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన విధంగానే, బీసీల కోసం పోరాటం చేస్తామన్నారు.

BJP is against BC, SC and ST

Leave A Reply

Your email address will not be published.