29 C
Hyderabad
Monday, August 3, 2026

స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: అపర్ణ హాస్పిటల్ వారి సౌజన్యంతో తడపకల్ గ్రామంలో స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత ఆరోగ్య శిభిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆరోగ్య శిభిరంలో ఎముకల వైద్యుడు ప్రకాశ్, పిల్లల డాక్టర్ అమర్నాథ్, గైనకాలజీ అపర్ణ రావడం జరిగింది. ఈ శిబిరంలో దాదాపు 200 మందికి అన్ని రకాల టెస్ట్ లు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. అనారోగ్యంతో బాధ పడుతున్న వారికి తగు సలహాలు సూచనలు ఇచ్చారు. సందర్భంగా స్పందన ఫౌండేషన్ వారు అపర్ణ హాస్పిటల్ వారు ఏర్పర్చిన ఆరోగ్య శిబిరం పట్ల హర్షం వ్యక్తం చేసి వైద్య బృందాన్ని శాలువాలతో ఘనంగా సన్మానించారు. దీని సందర్భంగా అపర్ణ హాస్పిటల్ మేనేజ్మెంట్, తడపాకల్ గ్రామస్తులు స్పందన ఫౌండేషన్ నలిన్ ఇల్లెందుల ను అభినందించారు. ఈ కార్య క్రమంలో అంకం జ్యోతి ఫౌండేషన్ జ్యోతి, కరుణ ట్రస్ట్ ఫౌండర్ తుమ్మల మహేష్ కుమార్, గ్రామ సర్పంచ్ ప్రకాశ్, ఆర్ ఏం పీ వైద్యులు కిషన్,భాస్కర్, సురేష్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

A free medical camp under the auspices of Spandana Foundation

More articles

Latest article