రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ (బాలుర)ఉన్నత పాఠశాలలో ఆదివారం 1993-94 వ సంవత్సరం ల్లో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయురాలు పాల్గొని తమ తీపి జ్ఞాపకాలను నెమరు వేసి సంతోషంగా గడిపారు. మూడు దశబ్దాల తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళిన వారు కొందరు, ఎక్కడెక్కడో స్థిర పడిన వారు కొందరు, ఉద్యోగాల్లో కొందరు, సహదర్మచరినిలుగా కొందరు, వివిధ స్తితుల్లో జీవిస్తూ తమ మిత్రులను కలవాలనే కలంపులో ఆనాటి విద్యార్థులైన కొంత మంది విద్యార్థులకు ఆలోచన కలిగింది. ఈ సమ్మేళనంలో తమ గురువుల బోధనలు తమ కుటుంబ పరిస్థితులు నాటి చిలిపి చేష్టలను క్రమశిక్షణ పేరుతో గురువుల దండనలు తలుచుకుంటూ సాగిన పూర్వ విద్యార్థుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు ప్రసాద్ రావు, శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్, రుక్మిణి, స్వర్ణకుమారి విద్యార్థులు పద్మ సాయినాథ్, పార్వతి శేఖర్, విజయ భాస్కర్, గొర్ల గోపి, అక్కపల్లి నాగేందర్, అబ్దుల్ బారి, దార్కోజి బాలాజీ, మరి ఉమారాణి, పార్వతి సుజాత, బండారి కవిత పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
