పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ (బాలుర)ఉన్నత పాఠశాలలో ఆదివారం 1993-94 వ సంవత్సరం ల్లో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయురాలు పాల్గొని తమ తీపి జ్ఞాపకాలను నెమరు వేసి సంతోషంగా గడిపారు. మూడు దశబ్దాల తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళిన వారు కొందరు, ఎక్కడెక్కడో స్థిర పడిన వారు కొందరు, ఉద్యోగాల్లో కొందరు, సహదర్మచరినిలుగా కొందరు, వివిధ స్తితుల్లో జీవిస్తూ తమ మిత్రులను...