24.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలి

Must read

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
జుక్కల్, బతుకమ్మ : నియోజకవర్గంలో మనం చేపట్టిన అభివృద్ధి పనుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కార్యకర్తలకు సూచించారు. జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. జుక్కల్ మండలంలోని గ్రామాల నాయకులు,కార్యకర్తలు గ్రామ సమస్యల గురించి ఎమ్మెల్యే చర్చించడం జరిగింది.
సమస్యల పరిష్కారం దిశగా ఎమ్మెల్యే కృషి చేశారు. అదేవిధంగా మండలంలోని రోడ్లు, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, వ్యవసాయం మెరుగుపరచడమే తన ప్రాథమిక లక్ష్యమని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అవ్వాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని అన్నారు. పార్టీ వ్యతిరేక శక్తులు కొందరు ఏకమై పార్టీ ప్రతిష్టను దిగజార్చి పార్టీని చీల్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆ దుష్ట శక్తుల కుట్రలు తిప్పి కొట్టేవిధంగా మన తదుపరి కార్యాచరణ ఉండాలని దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

People should be made aware of development works

More articles

Latest article