30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

తడపాకల్ లో అభివృద్ధి పనులకు భూమి పూజ

Must read

📰 Generate e-Paper Clip

 ఏర్గట్ల, బతుకమ్మ: స్డీఎఫ్ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు తడపాకల్ గ్రామంలో  కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి ముత్యాల సునీల్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఎస్డీఎఫ్ నిధులను గ్రామానికి మంజూరు చేయించారని, ఆయనకు గ్రామస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని సీనియర్ కార్యకర్త జింక అనిల్ యాదవ్ అన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘం ప్రహరీ నిర్మాణానికి రూ.2.50లక్ష్లలు, పాత హనుమాన్ దేవాలయం ప్రహరీకి రూ.లక్షా50 వేలు, మాదిగ సంఘం కమ్యూనిటీ హాల్, ప్రహరీ నిర్మాణానికి రూ.2.50లక్షలు మంజూరైనట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్  అధ్యక్షుడు రాజు, నాయకులు కార్యకర్తలు వివిధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article