29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

మహిళా సంఘాల సమైఖ్య  సమావేశం

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందిరా క్రాంతి పథకం భవనంలో సోమవారం మహిళా సంఘాల సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వార్షికోత్సవం సందర్భంగా మహిళ సంఘాలకు మండల సమాఖ్య భవనాల మంజూరు, సంఘలలో లేని వారిని కోటి మంది మహిళలను సంఘంలో చేరాలని,ప్రతి గ్రామంలో వున్న వికలాంగులను గుర్తించి వారిని సంఘాలలో చేర్పించాలని,మహిళలకు ప్రమాద భీమా కింద 10 లక్షల ఇన్స్ రెన్స్,లోన్ భీమా,సురక్ష భీమా,మహిళ శక్తి క్యాంటీన్, మహిళకు సోలార్, నాటు కోళ్ల పెంపకం,పాల ఉత్పత్తిలో తయారు చేసే వస్తువులు,పాడి గేదెలు,పిండి గిరినీలు,ఎంటర్ ప్రైజులు,బ్యాంక్ లింకేజ్,స్త్రీ నిధి రుణాలు,వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుందని,ఇవన్నీ మహిళ సంఘాల సభ్యులకు ప్రభుత్వం కల్పిస్తుందని ఏపీఎం సువర్ణ తెలిపారు. వీటన్నింటిని మైల సంఘాల ఆధ్వర్యంలో ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అందరు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల అధ్యక్షులు,సీసీ లు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article