24 C
Hyderabad
Sunday, August 2, 2026

చేప పిల్లల విడుదల

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ  : తెలంగాణ ప్రభుత్వం ద్వారా రుద్రూర్ మండల కేంద్రంలో 3,52,040 చేప పిల్లలను పంపిణీ చేయవలసి ఉండగా, సోమవారం రుద్రూర్ గ్రామ చెరువులో 1,38,800, రాణంపల్లి కొత్త చెరువులో 36,310 నేడు మొత్తం 1,75,110 చేపలను వదలడం జరిగిందని మండల అధికారులు తెలిపారు. చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో మండల అధికారులు, బాన్సువాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్, మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, గ్రామ అధ్యక్షులు పార్వతి ప్రవీణ్, పార్టీ నాయకులు కర్క అశోక్, షైక్ నిస్సార్, పోతారాజ్ లింగం, అడపా సాయిలు, ఉరది నరేందర్, సోషల్ మీడియా ఇంచార్జి వడ్ల నరేష్,  పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article