నాందేడ్, బతుకమ్మ: మహా రాష్ట్ర ఎలక్షన్ ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రోడ్ షొలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో ఆదివారం నాందేడ్ జిల్లా దెగ్లూరు అసెంబ్లీ నియోజకవర్గం లోని బిలోలి లో కాంగ్రెస్ నాందేడ్ ఎంపీ అభ్యర్థి రవీందర్రావు వసంత్ రావు చవాన్, దే గ్లూరు అసెంబ్లీ అభ్యర్థి నివర్తి రావు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. చీఫ్ గెస్ట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీయం రేవంత్ రెడ్డి మాట్లాడుతు…. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మహా రాష్ట్ర డెవలప్ మెంట్ భాధ్యత రాహుల్ గాంధీ తీసుకుంటారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన పనులను వివరించారు. తెలంగాణ కు పొరుగున ఉన్న నాందేడ్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ప్రచార భాధ్యతలు చెపట్టి గెలుపు కోసం పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

