శ్రీలక్ష్మి నర్సింహాస్వామికి ప్రత్యేక పూజలను చేసిన ప్రధాన న్యాయమూర్తి
భీమ్ గల్, బతుకమ్మ
భీమ్ గల్ నింబచలం (లింబాద్రి గుట్ట)పుణ్య క్షేత్రంను ఆదివారం జిల్లా జడ్జ్ కుంచల సునీతా దర్శించుకొన్నారు.జిల్లా అడిషనల్ జడ్జ్ వేముల దీప్తి తో కలిసి గర్భలయంలోని శ్రీలక్ష్మి నర్సింహాస్వామికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి వారిని సాధారంగా ఆహ్వానించి సంకల్పం చేసి వారికి హారతి, ఆశీర్వచనంలను అందించారు. అనంతరం వారికి తీర్థ ప్రసాధాలను అందజేసిన శేష వస్త్రంతో సత్కరించారు. వారి వెంట భీమ్ గల్ సీఐ నవీన్, ఎస్సై మహేష్ లు ఉన్నారు.
