23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

కాంగ్రెస్ కూటమి మాయమాటలు నమ్మి మోసపోయి గోసపడొద్దు

Must read

📰 Generate e-Paper Clip

– అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కాంగ్రెస్ కూటమి మాయమాటలు నమ్మి మోసపోయి గోసపడొద్దు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సూచించారు. భారతీయ జనతా మహాయుత కూటమి ఆధ్వర్యంలో భోకర్ తాలూకా పాలజ్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ముఖ్యఅతిథులుగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ,మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ రావు చౌహన్ తో  కలిసినిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతు కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక, తెలంగాణలో గ్యారంటీల పేరుతో మోసం చేసి వందరోజుల్లో అమలు చేస్తానని సంవత్సరం కావొస్తున్న ఇప్పటికి ఒక్క గ్యారంటీ పూర్తిగా అమలు చేసిన దిక్కు లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలలో ప్రజల విశ్వసాన్ని కోల్పోయి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 8 బిజెపి స్థానాలను గెలిపించారని గుర్తు చేసారు.  కాంగ్రెస్ 60 ఏళ్ల పాలన అవినీతి కుంభకొనాల మయం అన్నారుఅటువంటి పాలనకు భారత దేశ ప్రజలు ఎప్పుడో చరమగీతం పాడారని అన్నారు, మరాఠ ప్రజలు కాంగ్రెస్ మాయ మాటలు నమ్మిమోసపోయి గోసపడొద్దని అన్నారు. బిజెపి కేంద్రప్రభుత్వం నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు, అవస్ యోజన, ఉజ్వల యోజన, సుకన్య సమృద్ధి యోజన, కిసాన్ సన్మాన్ యోజన, ఇలా అనేక పథకాలు చిట్టాచివరి పేదోనికి ఎలాంటి అవినీతి లేకుండా అందుతున్నాయి అన్నారు.

Don't be fooled by the lies of the Congress alliance

More articles

Latest article