30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ర్యాగింగ్ ను అరికట్టాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ : నగరంలోని హాస్టళ్లలో ర్యాగింగ్ ను అరికట్టాలని పీ డీ ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ జిల్లా సంక్షేమ హాస్టళ్ల అధికారు లను కోరారు. పీ డీ ఎస్ యూ ఆధ్యర్యం లో మంగళవారం నగరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిజామాబాద్ నగరం లోని ఎస్ ఎం హెచ్ లో విద్యార్థుల పరిచయం, హాబిట్స్ ప్రదర్శన పేరుతో జూనియర్లపై వికృత చేష్టలకు పాల్పడడం సరికాదన్నారు. గ్రామీణ విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. సీసీ. కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో పిడిఎస్యు నాయకులు దేవిక, లహరి, అక్షయ్, రాకేష్, బిందు, రాజు పాల్గొన్నారు.

More articles

Latest article