27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పొలంలోకి దూసుకెళ్లిన కారు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,  నాగిరెడ్డిపేట్ : మండల కేంద్రం సమీపంలోని వాగులమోరీ బ్రిడ్జి సమీపంలో ఎక్సెల్ వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తిని తప్పించబోయి కారు పొలంలోకి దూసుకెళ్లింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన సునీల్ అనే వ్యక్తి బోధన్ నుండి హైదరాబాద్ కు తన బొలెరో వాహనంలో వెళ్తుండగా ఉదయం 9 గంటల సమయంలో నాగిరెడ్డిపేట మండల కేంద్రం సమీపంలోని బోధన్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై వాగుల మోరి బ్రిడ్జి వద్ద ఎక్సెల్ వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తిని తప్పించబోయి కారుకు బ్రేకులు ఫెయిల్ కావడంతో కారు ప్రమాదవశత్తు పొలంలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు ఎలాంటి ప్రమాదం జరగపోయినప్పటికీ, ఎక్సెల్ పై ప్రయత్నిస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలు కావడంతో విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.

More articles

Latest article