24.7 C
Hyderabad
Monday, August 3, 2026

రిజిస్ట్రేషన్‌ సేవలు నిలిపివేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం

Must read

📰 Generate e-Paper Clip

డీఐజీ రమేశ్‌ రెడ్డి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాదు ఉమ్మడి జిల్లాలోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలలో సేవలు నిలిపివేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమైనవని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిజామాబాద్ డీఐజీ రమేశ్‌ రెడ్డి, జిల్లా రిజిస్ట్రార్ ప్రసూన గార్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని పది రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో సేవలు అందించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. కార్యాలయ సిబ్బంది ఎలాంటి బంద్‌లు పాటించడం లేదని స్పష్టం చేశారు. కొందరు దస్తావేజు లేఖర్లు మాత్రమే సేవలు నిలిపివేసినట్లు వారి ద్రష్టికి వచ్చింది దానికి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. జిల్లాలోని రిజిష్ట్రేషన్‌ కార్యాలయాలన్నీ తెరిచి ఉన్నాయని కావున ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి నేరుగా సంబంధిత సబ్ రిజిస్ట్రార్లను సంప్రదించి యాదవిధిగా రిజిస్ట్రేషన్ సేవలు పొందవచ్చు అని వారు వెల్లడించారు.

More articles

Latest article