రిజిస్ట్రేషన్ సేవలు నిలిపివేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం
డీఐజీ రమేశ్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాదు ఉమ్మడి జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో సేవలు నిలిపివేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమైనవని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిజామాబాద్ డీఐజీ రమేశ్ రెడ్డి, జిల్లా రిజిస్ట్రార్ ప్రసూన గార్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని పది రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో సేవలు అందించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. కార్యాలయ సిబ్బంది ఎలాంటి బంద్‌లు పాటించడం లేదని స్పష్టం చేశారు. కొందరు దస్తావేజు లేఖర్లు మాత్రమే సేవలు నిలిపివేసినట్లు వారి ద్రష్టికి వచ్చింది దానికి రిజిస్ట్రేషన్...