భీమ్ గల్, బతుకమ్మ : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన పూలె అంబేద్కర్ గ్రంథాలయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈవో స్వామి సూచించారు. గురువారం పాఠశాల లో లైబ్రరీ ని ఆయన లాంచనంగా ప్రారంభం చేశారు. ఈ సందర్బంగా ఎం ఈ ఓ మాట్లాడుతూ పుస్తక పఠనం అలవాటు చేసుకోవడం ద్వారా జీవితంలో ఉన్నత స్థానాలు చేరుకోవడం సులభం అవుతుందన్నారు. ఈ సందర్బంగా స్టూడెంట్స్ కు వ్యాసరచన, ఉపన్యాసం, పాటల పోటీలు ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం లో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు లింబాద్రి, టీచర్స్ జాన్ విల్సన్, శివకుమార్, గట్టు ఈశ్వర్ స్టూడెంట్స్ పాల్గొన్నారు.
