26.3 C
Hyderabad
Monday, August 3, 2026

స్వాతి ప్రియ చావుకి కారకులు ఎవరు..?

Must read

📰 Generate e-Paper Clip

టీజీవీపి జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : సోమవారం బాసర  ట్రిపుల్ ఐలో ఆత్మహత్య  చేసుకున్న  స్వాతి ప్రియ చావుకు కారకులు ఎవరని టీజీవీపీ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ ప్రశ్నించారు.  తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యం లో విలేకరుల సమావేశం మంగళవారం నగరంలోని టీజీవీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కల్యాణ్ మాట్లాడుతూ స్వాతి ప్రియ చావు పై ప్రశ్నలు లేవనెత్తారు. ఒక విద్యార్థిని ఆరు పేజీలు సుదీర్ఘంగా సూసైడ్ నోట్ రాసి ఉండగా అందులో ముఖ్యమైన కారణం ఎందుకు పేర్కొనలేదని అన్నారు. నోట్ లో తన ఫోన్ కాల్ హిస్టరీని చెక్ చేయవద్దని స్వాతి ప్రియ రాసి ఉండగా, దానికి వెనుక ఉన్న అసలు కారణం ఏమిటని ప్రశ్నించారు. స్వాతి ప్రియ ఒక టాప్ స్టూడెంట్ గా ఉండి, మానసికంగా దృఢంగా ఉండలేకపోవడం ఏంటి? విద్యార్థులు ఇలాంటి పరిస్థితులకు ఎందుకు దారి తీస్తున్నారని అన్నారు. విద్యార్థులకి మోటివేషనల్ క్లాసెస్ నిర్వహించి వారికి మనో ధైర్యం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు అఖిల్, సాయి,అఖిలేష్, మనోహర్,అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article